మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చా ???

అవి నేను అమెరికాలో ఉన్న రోజులు. ఒక హోటల్ లో ఉండేవాడిని. అదేంటో అక్కడ ఎక్కడ చూసినా మెక్సికన్ లే కనిపిస్తూ ఉంటారు – ఫ్రెష్ ఫార్మ్స్ లో చూసినా, మా హోటల్ లో రూమ్స్ క్లీన్ చేసే వారిని చూసినా, మెకానిక్ షెడ్ కు వెళ్ళినా. తరువాత తెలిసింది, మెక్సికో అమెరికా ప్రక్కనే కాబట్టి, వీళ్ళు అంతా ఇక్కడకు వలస వచ్చేస్తూ ఉంటారని. మా హోటల్ లో రూంని వారానికి ఒక్కరోజు క్లీన్ చేస్తారు. ఒక ఐదుగురు టీం ఉండేది. నేను గమనించింది ఏమిటి అంటే చాలామంది పొట్టిగా, లావుగా, ఉంటారు అని. ఈ ఐదుగురు లో నలుగురు కూడా సేమ్ బాచ్ కు చెందిన వారు. కాని మిగిలిన ఒక అమ్మాయి మాత్రం కాదు. తనను అక్కడకు వెళ్ళిన మూడు నెలల తరువాత చూసాను. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటే అటువైపు వెళుతుంటే … చూసింది. ‘హాయ్’ అన్నాను. తిరిగి హాయ్ చెప్పింది. అప్పుడు అబ్సర్వ్ చేసాను. తను మిగతా వాళ్ళ లా కాదు. పొడుగ్గా, మరీ లావు, సన్నం కాకుండా, యెర్ర గా ఉంది. ఎరుపు అంటే ఎరుపు కాదు … యాపిల్ కలర్. అయ్యా బాబోయ్, ఇంత అందం గా ఉందేంటిరా అనుకున్నాను. ఇక అప్పటి నుండి, తనను బాగా చూడడం మొదలెట్టాను.
ఒక రోజు మళ్లీ కనిపించింది. ఈ సారి, నీ పేరేంటి అని అడిగా. “లుపీత” అని చెప్పింది. అర్థం కాలేదు. ‘సారీ’ అన్నాను. మళ్లీ చెప్పింది. ‘లుపీతా’ అని. అర్థం కాలే. ఆఫీసు కు వెళ్ళిన వెంటనే గూగుల్ ఓపెన్ చేసి, మీనింగ్ వెతికాను. పూర్తిగా అర్థం కాలేదు కాని, మదర్ మేరి కు సంబంధించినది అని తెలిసింది. ఓకే, ఈ సారి తను కనిపిస్తే, తనను ఆశ్చర్య పరిచేలా, స్పానిష్ లో పలకరిద్దాం అని చెప్పి, స్పానిష్ చెప్పే సైట్స్ ఓపెన్ చేసి రోజు డైలీ వాడే వాక్యాలు ఏమిటా అని వెతకడం మొదలెట్టాను. తను కొన్ని రోజులు కనిపించలేదు కాని నా ఈ ఎక్సర్సైజ్ మాత్రం కొన్ని రోజులు సాగింది. రోజు నేను ఉదయం ఎనిమిది కే వెళ్లి, సాయంత్రం వచ్చే వాళ్ళం. తను ఎనిమిది తరువాత వచ్చి, మధ్యాహ్నం వెళ్ళిపోయేది. శని వారాలు పని ఏమి లేకపోయినా హోటల్ లో అటు, ఇటు తిరుగుతూ ఉండేవాడిని, తను కనిపిస్తుందేమోనని.
అటువంటి ఎదురుచూపుల కాలం లో, ఒక రోజు … అయ్యో … ఒకరోజు జరిగిందా సంఘటన. బయట నుండి వస్తుంటే … రిసెప్షన్ లో ఎవరో మెరుస్తూ కనిపించారు. ఎవరీ మెరుపు తీగ అని చూస్తే, తనే. బ్లాక్ కలర్ టీ షార్ట్ వేసుకుని, జీన్స్ వేసుకుని, మతి పోయేలా ఉంది. కలర్ ఉన్నవాళ్ళు, బ్లాక్ కలర్ లో అందంగా కనపడతారు అనుకుంటాను. పైకి వెళ్ళి వచ్చేటప్పటికి కనిపించలేదు. అడిగితే ఏదో రూం లో ఉంది అని తెలిసింది. వెళ్ళాను. అప్పుడు గాని నేను ఆలోచించలేదు. నేను ఎందుకు ఇలా తిరుగుతున్నాను. వెళ్ళి ఏమి చేస్తాను. ఏమో నాకే తెలియదు !! వెళ్ళాను. ద్వారం తెరచియే ఉన్నది. చేతులు కట్టుకుని, డోర్ మీద వాలి ఒక పోజ్ ఇస్తూ, తనను చూస్తూ నిల్చున్నాను. తను కొంతసేపటికి గాని నన్ను గమనించలేదు. “ఏమి కావాలి” అని అడిగింది. నాకు అప్పటివరకూ చదివిన స్పానిష్ పదాలు, వాక్యాలు గుర్తుకు రాలేదు. ఏమి మాట్లాడాలో తెలియలేదు. “ఏమి లేదు, నీతో కొంచం మాట్లాడాలి” అన్నాను. “ఏమిటి” అంది. “నీకు పెళ్లి అయిందా” అని అడిగాను. కాని ఈ ప్రశ్న ఎందుకు అడిగానో నాకే తెలియదు. ఒక వేళ, అవ్వకపోతే ఏం చేసే వాడినో నాకు తెలియదు. “అయింది” అని చెప్పింది. అరరే, అనుకుని, బై చెప్పి వచ్చేసాను.
తప్పో, ఒప్పో నాకు తెలియదు కాని ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకుని, ముద్దు పెట్టేసుకోవాలి అనిపించేది. అప్పటి నుండి అప్పుడపుడూ కనిపించేది కాని, అలా చూస్తూ ఉండిపోయే వాడిని, పలకరించడం మానేసి …

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑