యెర్రని దుమ్మును రేపుకుంటూ ఆ ఊరికి ఉన్న ఒకే ఒక్క బస్సు ఆగింది ... ఆందోళనకారులు నాలుగు బస్సులను దహనం చేసారు ... రేపటి నుండి ఆటో యూనియన్ల ఆందోళన - ఎక్కువ సర్వీసులను నడపాలని ఆర్.టీ.సి నిర్ణయించింది ... ఏంట్రా యెర్ర బస్సు ఎక్కి వచ్చేసావా ??? ... నాకు తెలిసి ఇలా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఆర్.టీ.సి కి ఉన్న స్థానం చిన్నది కాదు అని నా అభిప్రాయం ... ఈ మధ్య... Continue Reading →
ఒక అమ్మాయి – రెండు బొట్టు బిళ్ళల కథ …
అమ్మాయీ లేదు, కథ లేదు గాని చిన్న విషయమే. చాలా కాలం గా గమనిస్తున్న విషయం. అదేంటో అమ్మాయిలు రెండు బొట్టులు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు. అందమయిన అమ్మాయిలు ఇంకా అందంగా కనిపిస్తారు. మామూలుగా కన్నా అందంగా కనిపిస్తారు. రెడీమేడ్ బొట్టు బిళ్ళలు కాకుండా, కుంకుమ వాడతారు అనుకుంటాను. జనరల్ గా గుడి కి వెళ్ళినపుడు ఇలా జరుగుతుందేమో. గుడికి వెళ్లేముందు తల స్నానం చేసి చక్కగా తయారవుతారు కదా. అంటే బావుంటారు. ఆ అందానికి, ఈ అందం... Continue Reading →
వెన్నెల్లో ఆడపిల్లా …
ఇప్పటివరకూ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన వెన్నెల్లో ఆడపిల్ల గురించి వినడమే గాని, స్టోరి తెలియదు. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్ 'హలో ... ఐ లవ్ యు ' ఈ నవల ఆధారం గా వచ్చిన సినిమా అని తెలిసినా, చూడలేదు. సాయి కిషోర్ చెప్పాడు ... హీరో చెస్ ప్లేయర్ అని, ఒక పోటీ లో కళ్ళకు గంటలు కట్టుకుని గెలుస్తాడని, అందుకు హీరోయినే హెల్ప్ చేస్తుంది అని ... నేను అదే క్లైమాక్స్ అనుకున్నాను ...... Continue Reading →
స్నేహమేరా జీవితం …
నేను టెన్త్ చదివి పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది. మా క్లాసు లో డెబ్బయి, ఎనబై మంది ఉండేవాళ్ళం. అందులో ఒక యాబై మంది అబ్బాయిలే. చాలా మందిని చూసి ఇంత కాలం అయిపోతుంది. దాదాపు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు కూడా. ఇంత కాలానికి అందరం మళ్లీ కలుసుకున్నాం. రోజంతా మాటల తోనే సరిపోయింది. మా వాళ్ళందరూ మా ఊరి లోనే ఉంటారు. రోజూ చూసుకుంటూనే ఉంటారు. వాళ్లకు ఇలా కలుసుకోవడం అంత గొప్పగా అనిపించకపోవచ్చు. ... Continue Reading →
నా లైఫ్ లో పౌర్ణమి ఎప్పుడు వస్తుంది బాబోయ్ ???
ఇంకో ఆరు నెలల్లో ఇరవై తొమ్మిది లోకి అడుగు పెడతాను, ఆ తరువాత ఇంకో సంవత్సరం పొతే ముప్పై లోకి జంప్ చేస్తాను. ఇప్పటికీ పెళ్లి కాలేదు. అయ్యో !!! అమ్మ, నాన్నలతో సహా అందరూ నాకు శత్రువులలా కనిపిస్తున్నారు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే. నాన్నకు తూర్పు వైపు సంబంధాలు ఇష్టం ఉండవట (తూర్పు అంటే శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం). అమ్మ ఏమో అమ్మాయిని చూసే భాద్యత అత్తా వాళ్లకు ఇచ్చేసింది, నా గురించి పట్టించుకోవడం మానేసింది. ... Continue Reading →
మాచవరం కొదమ సింహం
పూణే నుండి హైదరాబాద్ వస్తున్నపుడు బస్సు లో 'ఆవకాయ్ బిర్యాని' మూవీ వేసాడు. పూర్తిగా చూడలేదు గాని బాలేదు అనిపించింది. ఇలా బస్సు లో వస్తున్నపుడు మంచి సినిమాలు వెయ్యకపోతే నాకు చిర్రెత్తుకొస్తుంది. అదేంటో నాకు డబ్బులు పెట్టి హాలులో చూసిన సినిమా కన్నా, ఇంటికి వెళ్తున్నపుడు బస్సు లో వేసిన సినిమా చూస్తుంటే భలే గా ఉంటుంది. అది అప్పటివరకూ నేను చూడని సినిమా అయి ఉండి, మంచి సినిమా అయితే మరీను... చిన్నప్పుడు వినాయక చవితికి, దసరాకు, ... Continue Reading →
ఓ, సచిన్ ఇక్కడకు వెళ్లేవాడా !!
ఇంతకు ముందు పేపర్లో చాలా సార్లు చదివాను. సచిన్ ఫ్యామిలీ తో కలసి లోనావ్లా వెళ్ళాడు అని. అది పూణే కు దగ్గర అని తెలుసు కాని, మరీ ఇంత దగ్గర అని తెలియదు, అంటే జస్ట్ నలబై కిలోమీటర్ లు మాత్రమే. ఆఫీస్ పని మీద రెండు వారాలు పూణే లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు వెళ్ళాను ఇక్కడకు. చాలా మంది చెప్పారు చాలా బావుంటుంది అని. వెళ్ళిన తరువాతే తెలిసింది ఇంత బావుంటుంది అని. బైక్... Continue Reading →
మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చా ???
అవి నేను అమెరికాలో ఉన్న రోజులు. ఒక హోటల్ లో ఉండేవాడిని. అదేంటో అక్కడ ఎక్కడ చూసినా మెక్సికన్ లే కనిపిస్తూ ఉంటారు - ఫ్రెష్ ఫార్మ్స్ లో చూసినా, మా హోటల్ లో రూమ్స్ క్లీన్ చేసే వారిని చూసినా, మెకానిక్ షెడ్ కు వెళ్ళినా. తరువాత తెలిసింది, మెక్సికో అమెరికా ప్రక్కనే కాబట్టి, వీళ్ళు అంతా ఇక్కడకు వలస వచ్చేస్తూ ఉంటారని. మా హోటల్ లో రూంని వారానికి ఒక్కరోజు క్లీన్ చేస్తారు. ఒక... Continue Reading →
భూపతి పాలెం కథలు …
ఒక రోజు మా బావ ఉదయాన్నే కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. అపుడు నేను ఏంటి రా అని చెప్పి తన ఆలోచనలను దొంగిలించాను. వాటిని చూస్తే అపుడు తెలిసింది తను చదువుకున్న రోజుల గురించి ఆలోచిస్తున్నాడు అని. అవి ఇలా ఉన్నాయి ... అవి నేను భూపతిపాలెంలో చదువుతున్న రోజులు. అక్కడ ఎ.పీ గురుకుల స్కూల్ ఉంది. దీని గురించి కొంత - రాజు గారు అని ఉండేవారు. రెండవ ప్రపంచ యుద్ద సమయం లో నేతాజీ సుబాష్ చంద్ర... Continue Reading →
బోలో … గణేష్ మహారాజ్ కీ జై …
అపుడపుడు అనిపిస్తుంది ఏ పండగకు లేని శక్తి వినాయక చవితి కి ఉంది అనిపిస్తుంది. ఆ తొమ్మిది రోజులు ఎలా ఉన్నా, నిమజ్జనం రోజు మాత్రం చాలా బావుంటుంది. అసలు ఆ డప్పులు, ఆ డాన్సులు చూస్తుంటే సూపర్ గా ఉంటుంది. నాకు ఎప్పటి నుండో ఒక కోరిక మిగిలిపోయింది - వాళ్ళు కొట్టినట్లు డప్పు కొట్టాలి, డాన్సు వెయ్యాలి. మొన్న చాన్స్ వచ్చింది కాని సిగ్గేసింది. ఎవరో చూస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటే ఏమి చేయలేం.... Continue Reading →
నా FZ16 …
మొన్ననే బైక్ కొన్నాను. ఇప్పటి వరకూ ఆటోలు, బస్సుల మీదనే గడిపేసాను. మా బావ చెప్పాడు - నీకు వాహన యోగం ఉంది అని చెప్పి. వాహనం యెంత విలువయినదో కూడా చెప్పాడు. శివుడికి నంది, వినాయకుడికి మూషికం ఇలా ప్రతి దేవుడుకి వాహనం ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ హెల్త్ యెంత విలువయినదో, బండి హెల్త్ కూడా అంతే విలువ అని ఇంకా ఏవేవో చెప్పాడు. నాకు పల్సర్ అంటే చాలా ఇష్టం. కాని... Continue Reading →
మా లాకులు …
దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఇంటికి వెళ్ళాను. చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. మా అన్నయ్య కొడుకును ఫస్ట్ టైం చూడబోతున్నాను. వీటితో పాటు మా ఇంటి దగ్గర ఉండే కాలువలు, చెట్లు చూడబోతున్నాను అన్న ఆలోచనే నా గుండె వేగాన్ని పెంచేసింది. మా ఊరు పసలపూడి. అపుడెపుడో అమలాపురం దగ్గర బ్లో అవుట్ వచ్చిన పాశర్లపూడి కాదు, అతడు సినిమా లో ఉన్న బాశర్లపూడి కాదు, వట్టి పసలపూడి. పాత సినిమాలలో ఉన్నట్లు ఊరి చివర నది, ప్రక్కనే కొండమీద ... Continue Reading →