Category: Uncategorized
-
బొంగులో చికెన్
అప్పుడెప్పుడొ చాలా కాలం క్రితమ్ విన్నాను దీని గురించి. కానీ ఎప్పూడూ తినలేదు. ఈనాడు లో ఒక రోజు దీని గురించి రాసాడు. ఈసారి అరకు తప్పకుండా వెళ్ళాలి. ఇది తినాలి.
-
హుర్రే … కొట్టేసాం … గెలిచేసాం …
అద్భుతం ఈ విజయం … సచిన్ అయిపోగానే భయమేసింది. కాని, గంభీర్, ధోని భలే ఆడారు. మలింగా బౌలింగ్ కు రాగానే మళ్ళీ భయం వేసింది. అన్ని యార్కర్లు వేస్తున్నాడు. ధోని బాగా ఆడాడు. రెండు ఫోర్లు కొట్టాడు. విన్నింగ్ షాట్ కేక. ఇరవై ఎనిమిది సంవత్సరాల తరువాత గెలిచాం. మళ్ళా ఎప్పటికో ? అప్పటికి సచిన్ ఉండడు. గెలిచినా, ఈ కప్పుకు ఉన్న ఇది దానికి ఉండదు.
-
అతడెంత ఎదవో అతడికే తెలీదు …
మధ్యాహ్నం రెండు అవుతుంది. అపుడపుడే చలి తగ్గి వాతావరణం వేడెక్కడం మొదలెట్టింది. అతడు పొడుగ్గా, కొంచం సన్నగా, అందంగా ఉన్నాడు, ఇంగ్లీష్ మాట్లాడుతాడు. నీలి రంగు జీన్స్ పైన, నలుపు రంగు షర్టు వేసుకున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చి, లిఫ్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. లిఫ్ట్ డోర్ దాదాపు మూసుకుంటాయి అనగా తెరచుకున్నాయి. ఇద్దరు అమ్మాయిలు లోపలి వచ్చారు.
-
http://giridarshan.com
పూణే వచ్చి మూడు నెలలు అయిపోతుంది. నా టార్గెట్ ఒకే ఒక్కటి … రోజూ జిమ్ కు వెళ్లి కండలు పెంచాలి అని. కాని నా టైం బాలేదు. ప్రాజెక్ట్ లో పని చాలా ఎక్కువ ఉంది. అసలు సరిగా వెళ్ళట్లేదు. అసలు నేను ఏంటి, నాకు ఏమి కావాలి అన్న ఆలోచనలు వస్తున్న్నాయి. నెట్ మీద కూర్చుని పూణే లో ఉన్న ట్రెక్కింగ్ క్లబ్స్ ఏమిటో వెతికాను. http://giridarshan.కం/ అని గ్రూప్ దొరికింది. ప్రతీ వారం ఒక చోటకు ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వీక్ వెళ్ళలేను. …
-
sarpass ట్రెక్కింగ్
లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. ఏమి చేద్దాం అని ఆలోచిస్తుంటే వై.హెచ్.ఏ.ఐ గుర్తుకొచ్చింది. వెంటనే http://www.yhaindia.org/ కొట్టాను. మే లో హిమాచల్ ప్రదేశ్ లో మనాలి దగ్గర నుండి పది రోజులు ట్రెక్కింగ్ ఉంది. వెంటనే బుక్ చేసేసాను. ఫీ కేవలం మూడు వేలు మాత్రమే. ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్లి, అక్కడ నుండి సిమ్లా కు బస్సులో వెళ్ళాలి అని ప్లాన్. ఆఫీసులో సెలవు ఇస్తారా, లేదా అన్న భయం పట్టుకుంది. కాని, ఇప్పుడు ట్రెక్కింగ్ ను మిస్ అయితే …
-
నా బొమ్మకు పేరు పెట్టాలి …
బొమ్మలకు కూడా ఎక్స్ ప్రెషన్ లు ఉంటాయని నాకు దీనిని చూసిన తరువాతే తెలిసింది. ఎందుకో చూడగానే నచ్చేసింది. ఇది ఏంటో నాకు తెలియదు. ముళ్ళ పందిలా జుట్టు ఉంది, కాని అది కాదేమో. ఆ కళ్ళు చూస్తుంటే ఏదో అమాయకత్వం, భయం … ఏమీ అర్థం కానట్లు. అందుకీ దీనికి ముద్ద పప్పు అని పేరు పెట్టేసాను. ఎలా చూస్తుందంటే మనకు ఏమి అర్థం కానప్పుడు కళ్ళప్పగించి చూస్తామే అలా …
-
అందమయిన అమ్మాయిలు హయబుసల్లాంటి వారు …
అందమయిన అమ్మాయిలు హయబుసల్లాంటి వారు … ఇంజెన్ కెపాసిటి ఎక్కువ, పవర్ ఎక్కువ, రిక్వైర్మెంట్స్ ఎక్కువ, కొనాలంటే డబ్బులు ఎక్కువ, పైగా మన రోడ్ల మీద నడవడం కష్టమే. అమ్మాయికి కొంచం డబ్బులుండి, అందం ఉండి, కొంచం చదువుకొంటే హయబుస లా తయారవుతుంది … నాలాంటి సామాన్యుడికి దక్కించుకోవడం కష్టమే … మధ్యలో ఈ కేస్ట్ ఒకటి … ఏది తక్కువ, ఏది ఎక్కువ అన్న విషయం పక్కన పెడితే, తక్కువ అబ్బాయిని ఎక్కువ అమ్మాయి ఇష్టపడదు, ఎక్కువ…
-
యెర్ర బస్సు …
యెర్రని దుమ్మును రేపుకుంటూ ఆ ఊరికి ఉన్న ఒకే ఒక్క బస్సు ఆగింది … ఆందోళనకారులు నాలుగు బస్సులను దహనం చేసారు … రేపటి నుండి ఆటో యూనియన్ల ఆందోళన – ఎక్కువ సర్వీసులను నడపాలని ఆర్.టీ.సి నిర్ణయించింది … ఏంట్రా యెర్ర బస్సు ఎక్కి వచ్చేసావా ??? … నాకు తెలిసి ఇలా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఆర్.టీ.సి కి ఉన్న స్థానం చిన్నది కాదు అని నా అభిప్రాయం … ఈ మధ్య…
-
ఒక అమ్మాయి – రెండు బొట్టు బిళ్ళల కథ …
అమ్మాయీ లేదు, కథ లేదు గాని చిన్న విషయమే. చాలా కాలం గా గమనిస్తున్న విషయం. అదేంటో అమ్మాయిలు రెండు బొట్టులు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు. అందమయిన అమ్మాయిలు ఇంకా అందంగా కనిపిస్తారు. మామూలుగా కన్నా అందంగా కనిపిస్తారు. రెడీమేడ్ బొట్టు బిళ్ళలు కాకుండా, కుంకుమ వాడతారు అనుకుంటాను. జనరల్ గా గుడి కి వెళ్ళినపుడు ఇలా జరుగుతుందేమో. గుడికి వెళ్లేముందు తల స్నానం చేసి చక్కగా తయారవుతారు కదా. అంటే బావుంటారు. ఆ అందానికి, ఈ అందం…
-
వెన్నెల్లో ఆడపిల్లా …
ఇప్పటివరకూ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన వెన్నెల్లో ఆడపిల్ల గురించి వినడమే గాని, స్టోరి తెలియదు. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీకాంత్ ‘హలో … ఐ లవ్ యు ‘ ఈ నవల ఆధారం గా వచ్చిన సినిమా అని తెలిసినా, చూడలేదు. సాయి కిషోర్ చెప్పాడు … హీరో చెస్ ప్లేయర్ అని, ఒక పోటీ లో కళ్ళకు గంటలు కట్టుకుని గెలుస్తాడని, అందుకు హీరోయినే హెల్ప్ చేస్తుంది అని … నేను అదే క్లైమాక్స్ అనుకున్నాను ……
-
స్నేహమేరా జీవితం …
నేను టెన్త్ చదివి పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది. మా క్లాసు లో డెబ్బయి, ఎనబై మంది ఉండేవాళ్ళం. అందులో ఒక యాబై మంది అబ్బాయిలే. చాలా మందిని చూసి ఇంత కాలం అయిపోతుంది. దాదాపు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు కూడా. ఇంత కాలానికి అందరం మళ్లీ కలుసుకున్నాం. రోజంతా మాటల తోనే సరిపోయింది. మా వాళ్ళందరూ మా ఊరి లోనే ఉంటారు. రోజూ చూసుకుంటూనే ఉంటారు. వాళ్లకు ఇలా కలుసుకోవడం అంత గొప్పగా అనిపించకపోవచ్చు. …
-
మాచవరం కొదమ సింహం
పూణే నుండి హైదరాబాద్ వస్తున్నపుడు బస్సు లో ‘ఆవకాయ్ బిర్యాని’ మూవీ వేసాడు. పూర్తిగా చూడలేదు గాని బాలేదు అనిపించింది. ఇలా బస్సు లో వస్తున్నపుడు మంచి సినిమాలు వెయ్యకపోతే నాకు చిర్రెత్తుకొస్తుంది. అదేంటో నాకు డబ్బులు పెట్టి హాలులో చూసిన సినిమా కన్నా, ఇంటికి వెళ్తున్నపుడు బస్సు లో వేసిన సినిమా చూస్తుంటే భలే గా ఉంటుంది. అది అప్పటివరకూ నేను చూడని సినిమా అయి ఉండి, మంచి సినిమా అయితే మరీను… చిన్నప్పుడు వినాయక చవితికి, దసరాకు, …