Category: Uncategorized
-
మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చా ???
అవి నేను అమెరికాలో ఉన్న రోజులు. ఒక హోటల్ లో ఉండేవాడిని. అదేంటో అక్కడ ఎక్కడ చూసినా మెక్సికన్ లే కనిపిస్తూ ఉంటారు – ఫ్రెష్ ఫార్మ్స్ లో చూసినా, మా హోటల్ లో రూమ్స్ క్లీన్ చేసే వారిని చూసినా, మెకానిక్ షెడ్ కు వెళ్ళినా. తరువాత తెలిసింది, మెక్సికో అమెరికా ప్రక్కనే కాబట్టి, వీళ్ళు అంతా ఇక్కడకు వలస వచ్చేస్తూ ఉంటారని. మా హోటల్ లో రూంని వారానికి ఒక్కరోజు క్లీన్ చేస్తారు. ఒక…
-
భూపతి పాలెం కథలు …
ఒక రోజు మా బావ ఉదయాన్నే కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. అపుడు నేను ఏంటి రా అని చెప్పి తన ఆలోచనలను దొంగిలించాను. వాటిని చూస్తే అపుడు తెలిసింది తను చదువుకున్న రోజుల గురించి ఆలోచిస్తున్నాడు అని. అవి ఇలా ఉన్నాయి … అవి నేను భూపతిపాలెంలో చదువుతున్న రోజులు. అక్కడ ఎ.పీ గురుకుల స్కూల్ ఉంది. దీని గురించి కొంత – రాజు గారు అని ఉండేవారు. రెండవ ప్రపంచ యుద్ద సమయం లో నేతాజీ సుబాష్ చంద్ర…
-
బోలో … గణేష్ మహారాజ్ కీ జై …
అపుడపుడు అనిపిస్తుంది ఏ పండగకు లేని శక్తి వినాయక చవితి కి ఉంది అనిపిస్తుంది. ఆ తొమ్మిది రోజులు ఎలా ఉన్నా, నిమజ్జనం రోజు మాత్రం చాలా బావుంటుంది. అసలు ఆ డప్పులు, ఆ డాన్సులు చూస్తుంటే సూపర్ గా ఉంటుంది. నాకు ఎప్పటి నుండో ఒక కోరిక మిగిలిపోయింది – వాళ్ళు కొట్టినట్లు డప్పు కొట్టాలి, డాన్సు వెయ్యాలి. మొన్న చాన్స్ వచ్చింది కాని సిగ్గేసింది. ఎవరో చూస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటే ఏమి చేయలేం.…
-
మా లాకులు …
దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఇంటికి వెళ్ళాను. చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. మా అన్నయ్య కొడుకును ఫస్ట్ టైం చూడబోతున్నాను. వీటితో పాటు మా ఇంటి దగ్గర ఉండే కాలువలు, చెట్లు చూడబోతున్నాను అన్న ఆలోచనే నా గుండె వేగాన్ని పెంచేసింది. మా ఊరు పసలపూడి. అపుడెపుడో అమలాపురం దగ్గర బ్లో అవుట్ వచ్చిన పాశర్లపూడి కాదు, అతడు సినిమా లో ఉన్న బాశర్లపూడి కాదు, వట్టి పసలపూడి. పాత సినిమాలలో ఉన్నట్లు ఊరి చివర నది, ప్రక్కనే కొండమీద …
-
ఇవాళ ఏం జరిగిందంటే …
ఆఫీసు లో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పెట్టారు. మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తుంటే సరే అని చెప్పి నేను వెళ్ళాను. ఇంతకు ముందు ఒక సారి ఇచ్చాను గాని ఇప్పుడు భయం వేసింది. ఏం కాదు, ఏం కాదు, వెళ్ళు వెళ్ళు అని చెప్పుకుంటూ లోపలకు వెళ్ళాను. ఒక ఫాం ఇచ్చి కొన్ని ప్రశ్నలు వేసింది – గత సంవత్సర కాలం లో ఇండియా కు వెళ్ళావా అంది ? ఎందుకో అర్థం కాలేదు. లేదు అని…
-
చెత్త నా కొడుకుల్లారా …
నా కారు ఏమి కొత్తది కాదు, అంత ఖరీదు అయినది కాదు – కాని, అది నాది. తనది అయిన దేనిమీద అయినా ఎవరికయినా ఎంతో కొంత ఇది ఉంటుంది అనుకుంటాను. అదీ కాక, ఇది బావ ఇచ్చినది. మామూలు గా నాకు కోపం రాదు. వీళ్ళను ఆఫీసుకు తీసుకు వెళ్తాను కదా, అందరం కలిసే వెళ్తాం. కూర్చున్న తరువాత డోర్ నెమ్మదిగా వేయొచ్చు కదా. దానిని బద్దలు కొట్టాలి అన్నంత గట్టిగా వేస్తారు. లేక పొతే ఇది…
-
చికాగో ఎయిర్ షో
ప్రతి సంవత్సరం చికాగో లో ఎయిర్ షో జరుగుతుంది అట. గత సంవత్సరం నేను వచ్చేటప్పటికే అయిపోయింది. ఈ సంవత్సరం ఆగస్ట్ పద్నాలుగు, పదిహేను రోజులలో జరిగింది. అసలిప్పటివరకూ ఇటువంటివి చూడలేదు. మనకు నేవీ డే అని వైజాగ్ లో డిసెంబర్ లో జరుగుతుంది. కాని ఎప్పుడూ వెళ్ళలేదు. మన ఎయిర్ షో లు బెంగళూరు, హైదరాబాద్ లో అయినట్లు గుర్తు. కాని చూడలేదు. అప్పుడు ఎల్.సి.ఏ, ధ్రువ్ హెలికాప్టర్ లూ చాలా బావున్నాయి అట. ఆదివారం వెళ్దాం అనుకున్నాం. నాకు…
-
శరత్ గారిని కలవబోతున్నానోచ్ …
ఈ మధ్య తెలుగు బ్లాగులు ఎక్కువగానే చదువుతున్నాను. అలానే శరత్ గారి కాలమ్ కూడా … అపుడెపుడో ఏదో రాస్తే నేను కూడా ఈ దగ్గరలోనే ఉంటున్నాను. కలవాలి అనుకుంటే మెయిల్ చేయి అని చెప్పి id ఇచ్చారు. కాని ఎందుకో మెయిల్ చేయలేకపోయాను. మరి కొన్ని రోజులలో వెనక్కు వచ్చేస్తున్నాను కదా, కలుద్దాం అనిపించింది. ఈ మధ్యాహ్నమే మెయిల్ చేసాను. రిప్లై వచ్చింది – ఫోన్ నెంబర్ తో సహా. కాల్ చేసాను. విషయం ఏమిటి…
-
లాప్ టాప్ కొన్నానోచ్ …
-మనం వెనక్కి వెళ్ళే రోజు దగ్గర పడింది. బేసిక్ గా అమెరికా కు వచ్చే ప్రతి ఒక్కడు లాప్ టాప్ పట్టుకు వెళ్తాడు – ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రేట్లు తక్కువ కదా. ఇక్కడకు వచ్చిన కొత్తలో నాకు కొనే ఆలోచన ఏమి లేదు. కాని అక్కడకు వెళ్తే అవసరం అయితే ఏమి చేయాలి. సరే కొందాం అని అనుకున్నాను. కాని ఏమి కొనాలి. ముందు నుండి నాకు హెచ్. పీ. అంటే ఇష్టం. కాని తీరా కొనేటప్పటికి నిర్ణయం మారిపోయింది. …
-
ఏమి చదవాలి ?
అక్కడెక్కడో చదివాను – ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడితో సమానం అని. కాని మంచి పుస్తకం అంటే ఏమిటి ? రకరకాల పుస్తకాలు ఉంటాయి కదా. ఆలోచించాను – ఇప్పటివరకూ పెద్దగా ఏమి చదవలేదు కాని, చదివిన వాటిలో ఏమి ఎంజాయ్ చేసాను అని ?? స్వాతి లో వచ్చిన సీరియల్స్, సరసమయిన కథలు తప్పితే ఇంకేమి చదవలేదు, కాని అవి బాగానే ఎంజాయ్ చేసాను. ఈ మధ్య అనిపిస్తూ ఉంది … సినీమాలు, యు ట్యూబ్, …
-
ఒక అందమయిన సాయంత్రం …
బీచ్ లో బాగా ఆడి, అలసి పోయి, తడిచి పోయి, ఇసుకలో కూర్చుని, చల్లని గాలి ఒంటికి తగులుతుండగా – అస్తమించే రవి ని చూస్తుంటే భలే ఉంటుంది …. అదేదో సినిమా లో పవన్ కళ్యాణ్ భూమిక నడుమును వర్ణిస్తూ ఎరుపు, పసుపు కలసిన కలర్ లో ఉండి, రొమాంటిక్ గా ఉంటుంది అంటాడు. ఏ అమ్మాయి నడుమును ఇప్పటివరకూ చూడలేదు కాని, మన కంటికి కనిపించే దూరంలో, లేక్ ఎండ్ ఇదీ అన్న చోట…
-
పడమటి సంధ్యా రాగం …
ఇప్పుడే ఆఫీసు నుండి వచ్చాను. వేసవి కాలం కదా, తొమ్మిదవుతున్నా ఇంకా చీకటి పడలేదు. సూర్యుడు ఈ రోజుకిక బై అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ప్రపంచం చాలా అందం గా ఉంది. మనసు బావుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఇవాళ భలే ఉంది. ఉదయం నుండి వర్షం పడి ఆకాశం ఒక ప్రక్క మబ్బుగా ఉంది, మరో ప్రక్క ఎండగా ఉంది.