కొకండివా ట్రెక్ …

మొత్తానికి  కొకండివా  ట్రెక్ బానే కంప్లీట్ చేసాము. బావుంది. ఒక రోజే.  అసలు ఈ ట్రెక్ గురించి ఎలా తెలిసిందంటే,  గూగుల్ లో సెర్చ్ చేసాను, పూణే లో ట్రెక్కింగ్ క్లబ్స్ ఏమున్నాయి అని ... http://www.giridarshan.com/  కనిపించింది.  సైట్ బావుంది,  ప్రతి వారం ఏదో ఒక ప్లేస్ కి ట్రెక్ ఉంది ... ఈ వారం కోకండివా అన్న కొండమీదకి.  ఒక రోజు ట్రెక్.  సరే అని, డబ్బులు పే చేసాను.  ఆదివారం ఎప్పుడు వస్తుందా అని... Continue Reading →

హుర్రే … కొట్టేసాం … గెలిచేసాం …

అద్భుతం ఈ విజయం ... సచిన్ అయిపోగానే భయమేసింది.  కాని, గంభీర్, ధోని భలే ఆడారు.  మలింగా బౌలింగ్ కు రాగానే మళ్ళీ భయం వేసింది. అన్ని యార్కర్లు వేస్తున్నాడు.  ధోని బాగా ఆడాడు. రెండు ఫోర్లు కొట్టాడు.  విన్నింగ్ షాట్ కేక.  ఇరవై ఎనిమిది సంవత్సరాల తరువాత గెలిచాం.  మళ్ళా ఎప్పటికో ?  అప్పటికి సచిన్ ఉండడు.  గెలిచినా, ఈ కప్పుకు ఉన్న ఇది దానికి ఉండదు.

అతడెంత ఎదవో అతడికే తెలీదు …

మధ్యాహ్నం రెండు అవుతుంది. అపుడపుడే చలి తగ్గి వాతావరణం వేడెక్కడం మొదలెట్టింది.  అతడు పొడుగ్గా, కొంచం సన్నగా, అందంగా ఉన్నాడు, ఇంగ్లీష్ మాట్లాడుతాడు.  నీలి రంగు జీన్స్ పైన,  నలుపు రంగు షర్టు వేసుకున్నాడు.  గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చి, లిఫ్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. లిఫ్ట్ డోర్  దాదాపు మూసుకుంటాయి అనగా తెరచుకున్నాయి.   ఇద్దరు అమ్మాయిలు లోపలి వచ్చారు.

గోపాలరావు గారి హోటల్ – ఉగాది పచ్చడి

ఉగాది వచ్చింది కదా, పచ్చడి గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు మేము అందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. అందరం అంటే మా చిన్నాన్నలు, పిన్నులు, వాళ్ళ పిల్లలు, మామలు (తాతలు ఎప్పుడో పోయారు) . అంటే ఉమ్మడి కుటుంబం కాదు గాని, ఒకే చోట ఉండేవాళ్ళం. ఎప్పుడు ఉగాది వచ్చిన ఆనవాయితీ లేదు మనకు అని చెప్పి పచ్చడి ఎప్పుడూ చేసేవారు కాదు. మా ఇంట్లో మామిడి చెట్లు, వేప చెట్లు బానే ఉండేవి. వేప చెట్టు విరగ... Continue Reading →

http://giridarshan.com

పూణే వచ్చి మూడు నెలలు అయిపోతుంది. నా టార్గెట్ ఒకే ఒక్కటి ... రోజూ జిమ్ కు వెళ్లి కండలు పెంచాలి అని. కాని నా టైం బాలేదు. ప్రాజెక్ట్ లో పని చాలా ఎక్కువ ఉంది. అసలు సరిగా వెళ్ళట్లేదు. అసలు నేను ఏంటి, నాకు ఏమి కావాలి  అన్న ఆలోచనలు వస్తున్న్నాయి.   నెట్ మీద కూర్చుని  పూణే లో ఉన్న ట్రెక్కింగ్ క్లబ్స్ ఏమిటో వెతికాను.   http://giridarshan.కం/  అని గ్రూప్ దొరికింది.  ప్రతీ వారం ఒక చోటకు ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తున్నారు.  ఈ వీక్ వెళ్ళలేను. ... Continue Reading →

sarpass ట్రెక్కింగ్

లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది.  ఏమి చేద్దాం అని ఆలోచిస్తుంటే వై.హెచ్.ఏ.ఐ  గుర్తుకొచ్చింది. వెంటనే  http://www.yhaindia.org/  కొట్టాను. మే లో  హిమాచల్ ప్రదేశ్ లో  మనాలి దగ్గర నుండి పది రోజులు ట్రెక్కింగ్ ఉంది.  వెంటనే బుక్ చేసేసాను.  ఫీ కేవలం మూడు వేలు మాత్రమే.  ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్లి, అక్కడ నుండి  సిమ్లా కు బస్సులో వెళ్ళాలి అని ప్లాన్.  ఆఫీసులో సెలవు ఇస్తారా, లేదా అన్న భయం పట్టుకుంది.  కాని,  ఇప్పుడు ట్రెక్కింగ్ ను మిస్ అయితే ... Continue Reading →

రవితేజం …

బేసిగ్గా నేనేమీ రవి తేజ ఫ్యాన్ కాదు,నాకు సినిమాల గురించి అంతేమీ తెలియదు ... కాని ఎందుకో రవితేజ గురించి రాయాలి అనిపించింది. తన గురించి అందరికీ తెలిసింది బహుశా 'సింధూరం' సినిమా తో అనుకుంటాను.   తరువాత  'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'ఇడియట్'  సూపర్ గా ఉంటాయి. 'నిన్నే పెళ్ళాడుతా' లో నాగార్జునతో డిస్కో లో కొట్టించుకున్న ఒక చిన్న క్యారక్టర్ లో ఉంటాడు. అటువంటిది ఇప్పుడు ఇంత పెద్ద హీరో కావడం బావుంది. అసలు మన సినిమాలో... Continue Reading →

సరిగా ఐదు సంవత్సరాల క్రితం …

నేను జాబు లో జాయిన్ అయి ఇవ్వాల్టికి సరిగ్గా ఐదు సంవత్సరాలు ... అయ్యబాబోయ్ ... ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదోలా అనిపిస్తుంది ... ఏ విషయంలో అయినా  'మొదటి' కి ప్రత్యేక స్థానం ఉంటుందనుకుంటాను ... మనం సాధించింది ఏమన్నా ఉందా అని ఆలోచిస్తే 'లేదు' అన్న సమాధానం వస్తుంది ... అయినా ఏమి చెయ్యాలి ? అంతకు వారం రోజుల ముందే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయ్యాయి ... పండక్కి ఇంటికి... Continue Reading →

సంక్రాంతి … ఓకే … బానే ఉంది …

ఈ సంవత్సరం సంక్రాంతి ఏదో అలా, అలా గడచిపోయింది. ఇంటికెళ్ళి ఉంటే బావుండేది.  ఆ  భోగి మంటలు, బంతి పూలు,  లంగా వోణి అమ్మాయిలు,  పాపి కొండలు ట్రిప్  ... అన్నీ చూసి ఉండేవాడిని ... కాని మా టీం మేట్ పెళ్లి కేరళలో ఉంది. ఆఫీసుకి ఒకరోజు డుమ్మా కొట్టేసి నాలుగు రోజులు కేరళలో ఉందామని ప్లాన్.  చెత్తలాగా  నాతొ వచ్చేవాడు హ్యాండ్ ఇచ్చేసాడు. ఇక నేనూ వెళ్ళలేదు.  టైం బావుండి హైదరాబాద్ కు టికెట్... Continue Reading →

నా బొమ్మకు పేరు పెట్టాలి …

బొమ్మలకు కూడా ఎక్స్ ప్రెషన్ లు ఉంటాయని నాకు దీనిని చూసిన తరువాతే తెలిసింది.  ఎందుకో చూడగానే నచ్చేసింది.  ఇది ఏంటో నాకు తెలియదు. ముళ్ళ పందిలా జుట్టు ఉంది, కాని అది కాదేమో.  ఆ కళ్ళు చూస్తుంటే ఏదో అమాయకత్వం, భయం ... ఏమీ అర్థం కానట్లు.  అందుకీ దీనికి ముద్ద పప్పు అని పేరు పెట్టేసాను.  ఎలా చూస్తుందంటే మనకు ఏమి అర్థం కానప్పుడు కళ్ళప్పగించి చూస్తామే అలా ...

చెప్పడం కష్టమే ?

కొంతమంది ఎందుకు నచ్చుతారో చెప్పడం కష్టమే.  వాళ్ళ బిహేవియర్, అందం కూడా మనకు నచ్చే విషయాలలో పార్ట్ కావచ్చు.  మరీ అంత అందం లేకపోయినా నచ్చొచ్చు. నాకు ఒక జబ్బు ఉంది. ఎవరయినా అమ్మాయి కనిపిస్తే ఆకారాన్ని బట్టి జంతువులు గుర్తుకొస్తూ ఉంటాయి. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం,  జాబు లో జాయిన్ అయిన కొత్తలో ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఆన్సర్ షీట్స్ ఇస్తున్నారు. ఒకమ్మాయి పేరు పిలిచాడు. ఆ అమ్మాయి లేచి తీసుకోవడానికి వెళ్ళింది. ఆ అమ్మాయిని... Continue Reading →

అందమయిన అమ్మాయిలు హయబుసల్లాంటి వారు …

అందమయిన అమ్మాయిలు హయబుసల్లాంటి వారు ... ఇంజెన్ కెపాసిటి ఎక్కువ, పవర్ ఎక్కువ, రిక్వైర్మెంట్స్ ఎక్కువ, కొనాలంటే డబ్బులు ఎక్కువ, పైగా మన రోడ్ల మీద నడవడం కష్టమే.   అమ్మాయికి కొంచం డబ్బులుండి, అందం ఉండి,  కొంచం చదువుకొంటే హయబుస లా తయారవుతుంది ... నాలాంటి సామాన్యుడికి దక్కించుకోవడం కష్టమే ... మధ్యలో ఈ కేస్ట్ ఒకటి ... ఏది తక్కువ, ఏది ఎక్కువ అన్న విషయం పక్కన పెడితే,  తక్కువ అబ్బాయిని ఎక్కువ అమ్మాయి ఇష్టపడదు,  ఎక్కువ... Continue Reading →

Create a website or blog at WordPress.com

Up ↑