-
నచ్చింది …
నిన్ననే ఇప్పటి వరకూ ఉంటున్న హోటల్ ఖాళీ చేసి వుడ్ ల్యాండ్ క్రీక్ కు వచ్చాను. రూం నంబర్ మూడు వందల పదహారు. ఇప్పటికే సజ్జన్, జీతాన్, రితబ్రత, దీపేష్ ఉంటున్నారు. డబల్ బెడ్రూం కదా. రెండు రూం ల లోను సర్దేసుకున్నారు. నాకు వేరే ఎక్కడికి వెళ్ళడానికి కుదరక ఇక్కడకు వచ్చేసాను. వచ్చే ముందు రాకూడకు అనుకున్నాను కాని, వచ్చాక నచ్చింది. నిన్న రాత్రి వరకూ పని చేసాను. రెండున్నర, మూడు అయింది. నేను హాల్…
-
రూం నంబర్ 229
అమెరికా వచ్చి ఇవాల్టికి పది నెలలు అయింది. వచ్చే ముందు “కాండిల్ వుడ్ సూట్స్” లో రూం తీసుకున్నానని జీతాన్ చెప్పాడు. సింగిల్ రూం, బాత్ రూం, వండుకోడానికి స్టవ్, అన్నీ ఉన్నాయి. ఒక్క రూం లో ఇద్దరు. కాని ఇక్కడ పది నెలలు ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే భలే ఆశ్యర్యం గా ఉంటుంది. రూం ని ఎప్పుడూ నీట్ గా పెట్టుకోలేదు. ఇవాళ ఖాళీ చేసి వస్తుంటే ఏదోలా అనిపించింది.…
-
సుబ్బలక్ష్మి …
నిన్ననే బాణం సినిమా చూసాను. ఇది బావుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఒక బ్లాగులో చదివి బావుంది అనిపించి చూసాను. హీరో బావున్నాడు. తక్కువ మాటలు. నాకు హీరో కన్నా, సినమా కన్నా వేదిక కారక్టర్ చాలా నచ్చింది. సుబ్బలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి. సినిమా లో ఈమె తక్కువ సీన్లలోనే ఉన్నప్పటికీ, ప్రతీ సీన్ చాలా బావుంది. ఇంట్రడక్షన్ సీన్ లో పచ్చడి అడగడం, భోజనం చేసేటప్పుడు గుడ్డు వెజిటేరియన్ ఫుడ్ అంటే, గుడ్డు లోంచి పిల్ల…
-
చాలా బాగుంది …
కారు నడపుతానని, కారు కొంటానని నాకు ఎప్పుడూ కలలూ లేవు, ఆలోచనలూ లేవు. అది పెద్ద విషయం కాకపోవచ్చు. నాకు మాత్రం ఊహించని విషయమే. బావ హైదరాబాదు వెళ్ళిపోతున్నాడు. చివరివరకూ తన కారు తీసుకోవాలని ఆలోచన లేదు. బహుశా మే చివర్లో వెళ్ళిపోతాను అన్న ఆలోచన కావచ్చు. కాని అభిషేక్ చెప్పాడు నువ్వు ఇక్కడ ఆగస్ట్ వరకూ ఉంటావు అన్నాడు. వెంటనీ తనకు కాల్ చేసాను. నీ కారు నేను తీసుకుంటున్నాను అని. కాని ఎన్నో అలోచనలు…
-
రంగుల ప్రపంచం …
డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన దగ్గర నుండి కారు ఎప్పుడు నడుపుతామా, అంతా ఎప్పుడు చూస్తామా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రోడ్లు అంత అందంగా, సొగసుగా ఉంటాయి మరి … ఇక్కడకు వచ్చిన కొత్తలో రూం కే అతుక్కుని ఉండేవాడని … ఇప్పుడు శనివారం వస్తే చాలు ఎక్కడకు వెళ్తామా అనిపిస్తుంది. జయ తీర్థ్ గారిని అడిగాను – ఈ వారం ఎక్కడకు వెళ్తున్నాం అని. ఆయన చెప్పాడు – రమేష్ ఫ్యామిలీ, నేను, హరి కలసి హాలాండ్…
-
ఎప్పుడూ అనుకోలేదు …
కారు నేర్చుకోవడం మొదలెట్టి ఏప్రిల్ ఇరవై ఒకటికి నెల రోజులు అవుతుంది. అప్పటికి పన్నెండు క్లాసులు తీసుకున్నాను. ముందు రోజే బావ చెప్పాడు – చందమామ కర్కాటకం లో ఉంది. నువ్వు కళ్ళు మూసుకుని నడిపినా నీకు లైసెన్సు వస్తుంది అని. ఈ మాట చాలు – ఎక్కడ లేని కాన్ఫిడెన్సు వచ్చేసింది. అంటే డ్రైవింగ్ కష్టం అని కాదు. ఫస్ట్ టైం కదా కొంచం భయం గా ఉంటుంది. తీరా టెస్ట్ లో సరిగా నడపలేదు.…
-
గొంతులో తేనె పోస్తే …
ఒకసారి హరిహరన్ ను ఎవరో అడిగారు – “మీకు నచ్చిన, మీకు ఇచ్చిన పొగడ్త ఏది ?” అని. అపుడు ఆయన చెప్పాడు. ” దోసేళ్ళతో తేనెను తీసుకుని గొంతులో పోస్తే ఎలా ఉంటుందో, మీ పాట వింటున్నపుడు అలా ఉంటుంది ” అని ఒకావిడ చెప్పిందట. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు కాని, అన్నయ్య సినిమా రాక్షసుడు లో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాట వింటున్నపుడు అలానే అనిపిస్తుంది. అసలు పి.…
-
విరించి అంటే …
ఈ మధ్య సిరివెన్నెల సినిమాలో “విధాత తలపున” సాంగ్ ఎక్కువ సార్లు వింటున్నాను. మాటి మాటికి విరించి, విరించి అని వస్తూ ఉంటుంది. నేనూ విరించి అన్న పదాన్ని ఇంతకూ ముందు విన్నాను. కాని అర్థం తెలుసుకోవాలని ఎప్పుడూ ట్రై చెయ్యలేదు. సరే అని, గూగుల్ లో వెతికాను. అప్పుడు తెలిసింది, విరించి అంటే బ్రహ్మ అని. బ్రహ్మ లు ఏడుగురు ఉంటారట. అందులో మొదటివాడే విరించి. ఇతని పని అయిపోయిన తరువాత, అంటే ఒక కల్పం…
-
గోవిందా … గోవింద …
నేను ఉండే ప్లేస్ కు దగ్గరలో Aurora అని వేరే ప్లేస్ ఉందిలే. దగ్గర అంటే దగ్గర కాదు. కారులో ఒక నలభై నిముషాల పైనే పడుతుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇక్కడ అందరూ అరోరా టెంపుల్ అని అంటూ ఉంటారు. ఇంతకు ముందు ఇక్కడకు రాక ముందు అనుకున్నాను – బాలాజీని ఇక్కడ అరోరా అని కూడా అంటారని. కాని అది తప్పు. అరోరా అనేది ఆ ప్లేస్ పేరు. అదేంటో నాకు…
-
ముచ్చటగా మూడో రోజు …
ఇదేంటి రెండో రోజు ఏమయింది అనిపిస్తుంది కదా, అది అంత ఇంటరెస్టింగ్ అనిపించలేదు. అయినా ద్వితీయ విఘ్నం అధిగమించానులే. మన హీరోలు, డైరెక్టర్లు చాలా మంది రెండో సినిమాలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకో తెలియదు మరి … దానినే ద్వితీయ విఘ్నం అంటారు. లాస్ట్ శుక్రవారం క్లాసు ఉంది. వారం లో ఆఖరి రోజు కదా ఉత్సాహంగా untundi. పొద్దున్నే లేచి, తల స్నానం చేసి రెడీగా ఉన్నాను, రెనటా ఎప్పుడు వస్తుందా అని. ఎనిమిది…
-
కారు నేర్చుకుంటున్నానోచ్ . .
జీవితంలో కొన్ని కొన్ని మొదటి రోజు/మొదటి సారి చేసేటప్పుడు చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి , అది కాలేజ్ లో అడుగుపెట్టడం కావచ్చు, కంపెనీ లో అడుగుపెట్టడం కావచ్చు, నచ్చిన అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం కావచ్చు, ఏదయినా కొత్త విషయం నేర్చుకోవడం కావచ్చు, పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్న తరువాత అమ్మ, నాన్నలు పంపిన మొదటి అమ్మాయి ఫోటో కావచ్చు, ఇంకా చాలా, చాలా… మన తత్వవేత్త చెప్పినట్లు లైఫ్ బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎప్పుడు ఏదో…
-
రేపు అన్నది ఎలా ఉంటుందో .
మనలో చాలామందికి ఇవాల్టి కన్నా రేపటి గురించిన ఆలోచనలే ఎక్కువ. ఇవాళ యెంత బావున్నా అనుభవించకుండా రేపటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. రేపు ఎలా ఉంటుంది, మన జాబ్ ఎలా ఉంటుంది, మన జీతం ఎలా ఉంటుంది, ఇటువంటి ఆలోచనలే. కొన్ని సార్లు ఏదో జరుగుతుంది అని భయపడిపోతుంటాం. ఎక్కడో చదివాను – నువ్వు పులికి బయపడు . . . సింహానికి బయపడు అంతే కాని రేపటికి బయపడుతున్నావేమిటి అని. నిజమే ! మనం సాధారణ…